బాధితుడికి రూ. 20 వేల 500 ఆర్థిక సహాయం

చెన్నారావుపేట, జనవరి 24( జనం సాక్షి): మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన శీలం రాజుకు ఇటీవల కాలు సర్జరీ చేసి తీసివేయడం జరిగింది. శుక్రవారం బాధితుడిని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించారు.రాజును అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం తరఫున సహయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని అతని కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.అలాగే రూ.20 వేల 500 గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధార రంజిత్, ఉప సర్పంచ్ బండి హరీష్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ చీర అశోక్, అమీనాబాద్ మాజీ సర్పంచ్ బండి బాలరాజు, పత్తి నాయక్ తండా సర్పంచ్ జాటోత్ పత్ని, కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.



