సెవెన్ హిల్స్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కామారెడ్డి బాన్సువాడ జులై 27 (జనంసాక్షి)సీజనల్ వ్యాధులపై అవగాహన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోనిబాన్సువాడ పట్టణంలో గల సింధు విద్యాలయంలో శనివారం సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వాగ్దేవి, జనరల్ సర్జన్ డాక్టర్ రవితేజ విద్యార్థిని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు విచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. సింధు విద్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఎంతో హర్షినీయమని ఎంఈఓ నాగేశ్వర్ రావు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వాగ్దేవి మాట్లాడుతూ విద్యార్థులకు న్యూట్రిషన్ తో పాటు, సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా అవగాహన కల్పించి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ రవితేజ మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సింధు విద్యాలయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏదైనా ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరారు. వైద్య సేవలు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు ఉన్నతమైన విద్యను ఎంబిబిఎస్, తదితర లాంటి వాటిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రిన్సిపాల్ జగన్, ఉపాధ్యాయ బృందం, రమేష్, ప్రభాకర్, రాము, సునీత, శ్రీ వాణి, డాక్టర్ సంగ్రాం నాయక్, డాక్టర్ రోహిణి మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.