డైట్ చార్జీల పెంపుపై హర్షం

బోనకల్ నవంబర్ 2 (జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు డైట్ మరియు కాస్మెటిక్ చార్జీలు పెంచినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు ఏనుమల రేవంత్ రెడ్డి కి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి,మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బి సి గురుకుల పాఠశాల బోనకల్ ప్రిన్సిపల్ జ్యోతిర్మయి ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.