HCU విద్యార్ధులకు నేతల సంఘీభావం
రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు CPM జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి. HCU వర్సిటీకి వచ్చిన ఆయన… రోహిత్ ఆత్మహత్యకు కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతిస్తామన్నారు ఏచూరి.
యూవర్శిటీల్లో కుల వివక్ష కొనసాగుతోందన్నారు కంచె ఐలయ్య. ఉన్నత విద్యలో సమూల మార్పులు జరగాలన్నారు. వర్శిటీల్లో అగ్రకులా ఆధిపత్యం కొనసాగుతోందని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వీసీ..బాధ్యులైన మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కంచె ఐలయ్య.
రోహిత్ మరణం కచ్చితంగా కేంద్రం హత్యే అన్నారు.. కవి రచయిత.. జయరాజు. యూనివర్సిటీల్లో దళితులపై దాడులు జరగుతున్నాయని ఆరోపించారు. రోహిత్ నిజమైన అంబేద్కర్ వారసుడన్న ఆయన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ లో రాజకీయాలు లేకుండా చూడాలన్నారు. రోహిత్ కుటుంబ సభ్యులను ఆదుకోవాలన్నారు.
HCU లో విద్యార్ధులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంఘీభావం తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని జగన్ డిమాండ్ చేశారు. యూవర్శిటీల్లో రాజకీయ జోక్యం ఉండరాదన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్.
మరోవైపు తమపై సస్పెన్షన్ ఎత్తేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు బై కాట్ కు గురైన స్టూడెంట్స్. దళిత విద్యార్థులు కావటంతోనే వర్సిటీ అధికారులు తమపై సస్పెన్షన్ విధించారన్నారు. రోహిత్ ఫ్యామిలీకి న్యాయం చేయాలని కోరారు.