డైట్ చార్జెస్, కాస్మోటిక్ చార్జెస్ పెంపుపై హాస్టల్ విద్యార్థుల హర్షం

ఖమ్మం టౌన్, (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టల్స్ కి డైట్ చార్జెస్ మరియు కాస్మోటిక్ చార్జెస్ పెంచటంపై ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ (బి), విద్యార్థులు ప్లకార్డుల ప్రదర్శనతో వారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు ప్రజా ప్రభుత్వం పెంచిన చార్జెస్ వివరాలను విద్యార్థులకు వివరించారు, అవి 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు 1330 రూపాయలు, 8, 9, 10, విద్యార్థులకు 1540 రూపాయలు, కళాశాల విద్యార్థులకు 2100 రూపాయలు, అదేవిధంగా బాలురకు కాస్మోటిక్ చార్జెస్ 150 మరియు 200 రూపాయలు, బాలికలకు 175 మరియు 275 రూపాయలు పెంచినట్లు చెప్పారు. గతం కంటే 40 శాతం పెంపుదల పట్ల విద్యార్థులు వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మరియు గౌరవ క్యాబినెట్ మంత్రివర్యుల ఫోటోలు, అధికారుల ఫోటోలు, పెంచిన చార్జీల ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి సిబ్బంది నరేష్, వెంకన్న, పాల్గొన్నారు.