హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్ఎస్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పై… బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనకుండా బహిష్కరించిందని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది.హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలకు దూరంగా ఉండి, పరోక్షంగా మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలని చూస్తోందని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ 63 ఓట్లతో గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 112 మంది సభ్యులు ఓటర్లుగా ఉన్నారు.మజ్లిస్ పార్టీకి 49 ఓట్లు ఉండగా, ఇతర పార్టీల మద్దతు లభించింది. మొత్తం ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య తొమ్మిది చొప్పున ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఏడు, బీజేపీకి ఆరు ఉన్నాయి.

తాజావార్తలు