ఖాలీద్ భాయ్ అక్రమ నిర్బంధం.. ఉల్టా కేసు

కరీంనగర్ : తనపై దాడి చేశారని హోటల్ మానేరు అధినేత అబూబకర్ ఖాలీద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రోద్బలంతో ఖాళీద్ భాయి పైనే ఉల్టా చోర్ కోత్వాల్ కో దాటి అన్న చందంగా కేసులు నమోదు చేశారు. అక్రమంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్బంధించినట్టు సమాచారం. దాడి చేసిన వారిని ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేదు. పోలీసులు కొత్తపల్లి పోలీసులు గంగుల కమలాకర్ కు అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి పురుమల్ల శ్రీనివాస్ తరపున ఎలక్షన్ ఏజెంట్ అయినటువంటి అబూ బకర్ ఖాలీద్ ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార మదంతో, డబ్బు అహంకారంతో, రౌడీలతో ముస్లిం నేతలపైనే దాడి చేయిస్తుంటే సామాన్య ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. ఖాలీద్ భాయ్ కి మద్దతుగా పెద్ద ఎత్తున కొత్తపెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలివస్తున్నారు.