మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు : పెద్దపల్లి డిఆర్డిఓ కాళిందని

మంథని, (జనంసాక్షి) : 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ (యువతి)కు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం అందించడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెద్దపల్లి డిఆర్డిఓ కాళిందని “జనంసాక్షి” ప్రతినిధికి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మహిళ సంఘాల సభ్యులు 1,15,000 మంది ఉన్నారని, వారితో పాటు మిగిలిన మహిళలకు కలిపి ఇప్పటివరకు లక్షా 36 వేల ఇందిరమ్మ చీరలు జిల్లాకు రావడం జరిగిందని, వాటిని ఇప్పటికే ఐకెపి సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఇంకా ఎవరికైనా ఇందిరమ్మ చీరలు తక్కువ పడితే తెప్పిచ్చి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీకి ఇవ్వడం జరుగుతుందని, గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ వస్తే ఎలక్షన్ కోడ్ అనంతరం ఇవ్వడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.