ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్ ద్వారా ఇళ్ల నిర్మాణ పరిశీలన: మంత్రి పొంగులేటి

 ఖమ్మం (జనం సాక్షి); ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ సభలు పెట్టి మంత్రుల ద్వారా ఇళ్లను అప్రూవ్ చేస్తామని ఈ ప్రభుత్వంలో పేదవారిని గుర్తించి వారికి అండగా ఉండాలని ఉద్దేశంతో ప్రత్యేక యాప్ ను రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో గులాబీ రంగుచొక్కా వేసుకున్న వారికే స్కీములు ఇచ్చారని, వారు ఇంకా అదే బ్రమలో ఉన్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇందాక అర్హులైన వారిని గుర్తించి ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టడానికి ఈ యాప్ ద్వారా ఇళ్ల నిర్మాణ పరిశీలన జరుగుతుందని అన్నారు.