క్రికెట్ టీంకు జెర్సీలు పంపిణీచేసిన కొత్తకొండ శ్రీనివాస్
మల్యాల (జనంసాక్షి) : మల్యాల మండల కాంగ్రెస్ నాయకుడు కొత్తకొండ శ్రీనివాస్ మండలంలోని గొల్లపల్లె గ్రామ క్రికెట్ టీమ్ ని ప్రోత్సహించడానికి యువకులకు జెర్సీలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుందని, యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతోపాటు నియోజకవర్గానికి వన్నె తేవాలని ఆయన కోరారు. క్రీడలను ప్రోత్సహించి, యువతకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే జెర్సీలు పంపిణీ చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.