దేవుడినే మొక్కని కేటీఆర్… వేములవాడను దత్తత తీసుకుంటాడా….?

బాజాప జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్..
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి/ వేములవాడ నవంబర్ 20 (జనంసాక్షి)..
దేవుడిని మొక్కని కేటీఆర్ వేములవాడను దత్తత తీసుకుంటడని చెప్పడం సిగ్గుచేటని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. సోమవారము వేములవాడ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చేన్నమనేని వికాస్ రావు గెలుపు కోసం ఆయన సాయి రక్ష దాబా నుండి మహాలక్ష్మి ఆలయం మీదుగా, కోరుట్ల బస్టాండు, బద్ది పోచమ్మ ఆలయం నుండి, రాజన్న ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి రాజన్న ఆలయం ముందు స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వేములవాడలో బిఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే నేను వేములవాడ తీసుకుంటానని చెప్పేందుకు సిగ్గు లేదా
ఆన్నాడు. తొమ్మిదేళ్లు మీరే అధికారంలో ఉన్నారే మీ ఎమ్మెల్యే వున్న మీరు ఎందుకు వేములవాడను అభివృద్ధి చేయలేదని ఆయన ప్రశ్నించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న ఆలయానికి వచ్చి నా పెళ్లి ఇక్కడ అయింది ,నా కుల దైవం రాజన్న అని గారడి మాటలు చెప్పి రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా వందకోట్ల నిధులు ఇస్తానని చెప్పిన ఆయన రాజన్నకు శఠగోపం
పెట్టలేదా.. కొడుకు దత్తత తీసుకుంటానెందుకు సిగ్గు లేదా అని ప్రశ్నించాడు. కేటీఆర్ కు దేవుడిపై నమ్మకం లేదని దర్గా పై నమ్మకం ఉందన్నారు.
వారణాసి లాగా రాజన్న ఆలయం అభివృద్ధి చెందాలంటే డాక్టర్ వికాస్ గారిని గెలిపిస్తే ఆలయ అభివృద్ధి నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీని రాజన్న ఆలయానికి తీసుకువచ్చి కేంద్రం నిధులతో రాజన్న ఆలయం వారణాసి లాగా తీర్చిదిద్దే బాధ్యత నాదేనన్నారు. డాక్టర్ వికాస్ రావుకు రాజకీయ అనుభవం లేదు కానీ ప్రజల సమస్యలపై అవగాహన ఉందని ఆయన గెలిస్తే వేములవాడ నియోజకవర్గ రూపు రేఖలు మారుతాయన్నారు. రాష్ట్రంలో జరిగే పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే సీఎం కేసీఆర్ ఫోజులు కొడుతున్నాడని బండి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పలు సమస్యలపై పోరాటాలు చేస్తే నాపై 74 కేసులు పెట్టారని, రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చానని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా ప్రజల సమస్యలు పోరాటం చేశారా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఎన్నడైన జైలుకు వెళ్లారా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు.తెలంగాణ రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పులతో ఉందని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తున్నారని ఇవన్నీ ఎలా నెరవేర్చుతారో ఒక్కసారి ఓటర్లు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి ఐదు లక్షల కోట్ల అప్పులు తీర్చి వేసి, తెలంగాణ ప్రజల అప్పుల సంఖ్యలు తెంపుతామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తామన్నారు. అనంతరం బాజపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వికాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని, తెలంగాణలో రామరాజ్యం స్థాపించాలంటే బిజెపిని గెలిపించాలన్నారు. రాజన్నను దత్తత తీసుకునే దమ్ము కేటీఆర్ కు వుందా అని ప్రశ్నించారు. ఈనెల 30 న జరగనున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దీప, భాజపా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్ర మహేష్, ఎస్సీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి శంకర్,నాయకులు రేగుల సంతోష్ బాబు, రేగుల మల్లికార్జున్, బుర్ర శేఖర్ గౌడ్, రాపల్లి శ్రీధర్,అన్నారం శ్రీనివాస్, గడ్డమీది శ్రీనివాస్, ఏరెడ్డి రాజిరెడ్డి, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల అధ్యక్ష,కార్యదర్శులు, పతాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.