పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లి గా మారుద్దాం
మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య
మార్చి10(జనం సాక్షి):-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య కార్యాలయం నుండి జెండా చౌరస్తా,మజీద్, ఆమర్ నగర్ చౌరస్తా మీదుగా జూనియర్ కాలేజ్ మైదానం వరకు ర్యాలీని చైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నూగిల్ల మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ర్యాలీలో పాల్గొంటున్న అందరికి ధన్యవాదాలు పెద్దపల్లి పట్టణ ప్రజలు తమ ఇండ్లలో నుండి వచ్చే చెత్తను తడి పొడి చెత్తగా వేరుచేసి మీవద్దకు వచ్చే మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందించాలని అలాగే ఎమ్మెల్యే విజ్జన్న సహకారంతో పెద్దపల్లి అభివృద్ధి పదంలో నడుస్తున్నందున ప్రజలందరూ సహకరిస్తూ పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లి పట్టణంగా మార్చడానికి సహకరించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ ఆకుల వెంకటేష్ కి,వైస్ చైర్మన్ కి,తోటి కౌన్సిలర్లకు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్,కౌన్సిలర్లు మోలుగురి కమల్,నల్లలా పద్మ సురేష్, అక్కేపల్లి సుజాత క్రాంతి మున్సిపల్ మేనేజర్ లింగయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్, మెప్మాటి (టి ఎం సి)స్వప్న మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…



