గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు

ప్రముఖ కవి, జూకంటి జగన్నాథం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 20. (జనంసాక్షి):  గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని ప్రముఖ కవి ,జూకంటి జగన్నాథం అన్నారు. గురువారం 58 జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జిల్లా గ్రంధాలయ సంస్థలో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథం మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు గా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో సంపత్ రమేష్, సంగీతం శ్రీనివాస్, ఆకునిరి బాలరాజు, కాముని వనిత, గ్రంథ పాలకులు కమటం మల్లయ్య, ఇంచార్జ్ కార్యదర్శి బి శంకరయ్య, పలువురు పాఠకులు పాల్గొన్నారు.