ఆర్యవైశ్య భవన్ లో మహా అన్న ప్రసాద వితరణ

బచ్చన్నపేట నవంబర్ ( జనం సాక్షి )మండల కేంద్రం ఆర్యవైశ్య భవన్ లో పవిత్రమైన అమావాస్య పర్వదినం పురస్కరించుకొని కొత్తపల్లి తిరుపతయ్య-జయప్రద జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కొత్తపల్లి వెంకటలక్ష్మిరాజయ్య ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైశ్య భవన్ లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు బోడ కుంటి మల్లయ్య, జిల్లా రాజేశ్వర్, ఈదులకంటి ప్రతాపరెడ్డి, కొత్తపల్లి కాశీపతి, సిరిపురం రాజేశం, దొంతుల చంద్రమౌళి,, కొత్తపల్లి కిరణ్ కుమార్, దొతుల రాజు, కొత్తపల్లి శ్రీనివాస్, కొత్తపల్లి ప్రవీణ్ కుమార్, బండి శ్రీనివాస్ రెడ్డి, పిన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.


