march up dates
సచివాలయంలో హోంమంత్రి సబితాతో తెలంగాణ జేఏసీ నేతల భేటీ
హైదరాబాద్: సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ మార్చ్ అనుమతిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మార్చ్ వేదిక మార్చాలని జేనసీ నేతలకు ప్రభుత్వం సూచించింది. మార్చ్ వేదికను మార్చే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు తేల్చిచెబుతున్నారు. ఈ సమావేశం కన్నా ముందు తెలంగాణ మంత్రులు హోంమంత్రిని కలిసి మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
‘ మార్చ్’ అనుమతి కోసం బీజేపీ ర్యాలీ
హైదరాబాద్: సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు అనుమతివ్వాలని బాగ్‌లింగపల్లి నుంచి బీజేపీ శాంతి ర్యాలీ చేపట్టింది. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో తెలంగాణ ప్రాంతంలో ఉద్రికత్తలకు కారణమవుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. శాంతి యుతంగా జరిగే హైదరాబాద్ మార్చ్‌ను అడ్డుకుంటే ప్రజలు తిరగబడి హింసాత్మక సంఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైన కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అరెస్టులు ఆపకపోతే మెరుపు సమ్మె::టీఎన్‌జీవో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రా సాధన ఉద్యమంలో పాల్గోంటున్న తెలంగాణ ఉద్యోగస్థులను సీమాంధ్ర ప్రభుత్వం వేదిస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతొందని టీఎస్‌జీవో నేత శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. అక్రమ అరెస్టును ఆపాక పోతే మెరపు సమ్మెకు దిగి సీమాంధ్ర ప్రభుత్వానికి తమ తడాక చూపిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ మార్చ్ విజయంవతం కోసం టీఎస్‌జీవో భవన్ తెలంగాణ ఉద్యోగసంఘాలు సమావేశమయ్యాయి. సమావేశంలో శ్రీనివాస్‌గౌడు మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను, ఉద్యోగస్తులను, అన్ని వర్గాల ప్రజలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో బంధిస్తున్నారని. ఎమర్జేన్సీని తలపిస్తున్నారని ఆయన ధ్వజమొత్తరు. తెలంగాణ మార్చ్‌లో పాల్గొనడం ఈ మట్టి మీద పుట్టిన ప్రతి బిడ్డ హక్కు అని ఆయన పేర్కొన్నారు.
కేకే ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ అనుమతిపై చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాజీ రాజ్యసభ సభ్యుడుకే. కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వం నుండి హైదరాబాద్ మార్చ్‌కు అనుమతి ఇప్పించేందుకు సీఎంపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకోవల్సిన నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మార్చ్‌కు అనుమతి ఇచ్చేది లేదని ఇన్‌ఛార్జి డీజీపీ దినేష్ ప్రకటన పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బావిస్తున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు కదలుతున్న తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇప్పించకపోతే ప్రజల్లో తిరగలేమని మంత్రులు గ్రహించినట్లు సమాచారం, తెలంగాణ జేఏసీ నేతలతో మాట్లాడి వేదిక మార్చుకుంటే అనుమతి గురించి ఆలోచిస్తామని సీఎం మంత్రులకు సూచించడంతో వారు కేకే తో సమావేశామయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ, మంత్రులు జానారెడ్డి. సారయ్య. తెలంగాణ ఎంపీలు మందా జరన్నాధం, వివేక్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మార్చ్‌కు అనుమతినివ్వండి: డీజీపీకి తెలుగుదేశం విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాలంటూ తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకరరావు. మోత్కుపల్లి నరసింహులు డీజీపీ దినేశ్‌రెడ్డికి విజ్ఞాపన పత్రం అందించారు. శాంతియుతంగా ఈ కార్యక్రమం చేపడుతామంటే ఎందుకు అనుమతినివ్వలేదని వారు డీజీపీని ప్రశ్నించారు. అనంతరంవారు. విలేకరులతో మాట్లాడుతూ మార్చ్‌కు తెలుగుదేశం మద్దతు ప్రకటిస్తుందన్నారు.
తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాల్సిందే:చెన్నమనేని రమేష్
హైదరాబాద్: సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాల్సిందేనని టీఆర్‌ఎస్ నేత, మేములవాడ ఎమ్మెల్యే చెన్న మనేని రమేష్ డిమాండ్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ వాదుల అరెస్టును వెంటనే నిలిపివేయాలని, లేకుంటే తీవ్రపరిణామాలేంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ వాదులు ప్రజాస్వామ్య బద్ధంగా మార్చ్ చేసుకుంటే సీమాంధ్ర ప్రభుత్వానికి అభ్యంతరమేమిటని ప్రశ్నించారు.
మార్చ్‌లో పాల్గొంటా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ: తెలంగాణ మార్చ్‌లె పాల్గొంటానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలియజేశారుజ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎన్ని ఆటంకాలెదురైనా సెప్టెంబర్ 30న తెలంగాణ కవాతులో పాల్గొంటానని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గోనని నేతలను తెలంగాణ ప్రజలు ద్రోహులుగా చూస్తారని హెచ్చరించారు. అరెస్టు చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మార్చ్‌ను శాంతియుతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
వేదిక మార్చుకుంటే అనుమతి ఇవ్వాలని ప్రతిపాదన
హైదరాబాద్: తెలంగాణ కవాతపై ఐకాస నేతలతో మాట్లాడే బాధ్యతను హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు తెలంగాణ మంత్రులకు సీఎం అప్పగించారు. కవాతుపై తెలంగాణ మంత్రులతో సీఎం భేటీ ముగిసింది. ఈ భేటీలో మంత్రులు కవాతుకు అనుమతివ్వాలని ఈ భేటీలో మంత్రులు కవాతుకు అనుమతివ్వాలని సీఎంపై ఒత్తిడి తెచ్చారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎంపై ఒత్తిడి తెచ్చారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కవాతు వేదికను మార్చుకుంటే అనుమతివ్వాలని ఈ భేటీలో ప్రతిపాదించినట్లు సమాచారం, దీంతో కవాతు అనుమతిపై మధ్యాహ్నం ఐకాస నేతలతో హోంమంత్రి సమావేశం నిర్వహించనున్నారు.
ముగిసిన చర్చలు: ట్యాంక్‌బండ్ పైనే కవాతుకు ఐకాస పట్టు
హైదరాబాద్: తెలంగాణ ఐకాస నేతలతో మంత్రులు సబిత. సారయ్య, జానారెడ్డి, ఉత్తమకుమార్‌ల చర్చలు ముగిశాయి. చర్చల వివరాలను సీఎంకు వివరించేందుకు మంత్రులు సారయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు బయటకు వచ్చారు. ట్యాంక్‌బండ్‌పైనే కవాతు నిర్వహిస్తామని, నెక్టెస్‌రోడ్డులో కవాతుకు అనుమతి ఇవ్వాలని ఐకాస నేతలు పట్టుపట్టినట్లు తెలుస్తోంది.