విఎం బంజర్ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులో గంజాయిపట్టివేత

పెనుబల్లి, (జనంసాక్షి) : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు, పోలీస్ వివరాల ప్రకారం శుక్రవారం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన చెందిన బోయిన వెంకటరమణ అనే వ్యక్తి ఒరిస్సా నుండి సుమారు 70 వేల రూపాయల విలువ చేసే 1కేజీ 110 గ్రాముల ఎండు గంజాయిని భద్రాచలం నుండి విజయవాడ బస్సులో తరలిస్తున్నాడన్న సమాచారంతో వి.ఎం బంజర్ ఎస్ ఐ కె వెంకటేష్ తన సిబ్బందితో తనిఖీ నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు, విజయవాడ బస్సులో గంజాయితో ప్రయాణిస్తున్న వెంకటరమణ ను పట్టుకొని తనిఖీ చేయగా అతనివద్ద గంజాయి దొరకడంతో గంజాయిని స్వాధీన పరచుకుని అతనిని అదుపులోకి తీసుకొన్నారు.