సుమారు కోటి రూపాయలు విలువైన గంజాయి పట్టివేత

 

 

 

 

టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి):

* వివరాలు వెల్లడించిన ఇల్లందు డి.ఎస్.పి

వాహన తనిఖీల్లో భాగంగా టేకులపల్లి పోలీసులు కొత్తగూడెం,ఇల్లందు ప్రధాన జాతీయ రహదారిలో టేకులపల్లి మండల పరిధిలో సుమారు కోటి రూపాయలు విలువగల గంజాయి పట్టుకున్న సంఘటన టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో సిఐ బత్తుల సత్యనారాయణ చాంబర్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు డిఎస్ పి చంద్రబాను వివరాలు వెల్లడించారు. టేకులపల్లి మండలంలోని సాయన్నపేట క్రాస్ రోడ్డు సమీపంలో మూల మలుపు వద్ద, టేకులపల్లి పోలీసులు శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఏపీ 31 డిఏ 4554 నెంబర్ గల మారుతి కార్ లో 100 గంజాయి ప్యాకెట్లు కారు డిక్కీలో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. 199.673 కేజీల, 100 ప్యాకెట్ల గంజాయి విలువ రూ.99లక్షల 83వేలు ఉంటుందని తెలిపారు. పట్టుబడిన గంజాయి ఆంధ్ర – ఒడిస్సా బార్డర్ నుండి రాజస్థాన్ కు తరలిస్తున్నారని తెలిపారు. ఒడిస్సా నుంచి రాజస్థాన్ తరలిస్తున్న లాల్ సింగ్ చౌహన్ ను అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. లాల్ సింగ్ చౌహన్ పై ఇదివరకు మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ ఐ. ఆలకుంట రాజేందర్, బోడ్ ఎస్ఐ పి. శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.