ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలి
మంథని,(జనంసాక్షి) : జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గం పర్యాటక ప్రాంతానికి వచ్చిన టూరిస్టులపై జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి జిహాధిలా ఉగ్రదాడిలో చనిపోయిన హింధు పర్యాటకుల ఆత్మ శాంతి చేకూరలని రెండు నిమిషాలు మౌనం పాటించి అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడి సౌదీ అరేబియా ప్రభుత్వంతో రక్షణ ఒప్పందహాలు కుదుర్చుకుంటున్న సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో పర్యటన చేస్తున్న సమయంలో పాకిస్థాన్ ఓర్వలేనితనంతో భారత సైనికుల వేషంలో ఉగ్రవాదులని పంపించి పర్యాటక ప్రాంతానికి వచ్చిన పర్యటకులపై మత వివక్షత చూపుతూ ముస్లిమేతరులైన ప్రతి ఒక్క పర్యటకుణ్ణి అత్యంత క్రూరంగా, చిన్న పిల్లలనికూడ చూడకుండా 28 మందిని కాల్చి హతమార్చారని అవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని భారత ప్రభుత్వం గతంలో జరిగిన పులవమ గటనకు ఎ విధంగా అయితే సర్జికల్ స్ట్రైక్ జరిపి 300 మంది కిపైగా ఉగ్రవాదులని హతమార్చిందో ధానికి రెట్టింపు దాడి చేస్తూ ఉగ్రవాదుల మూలాలను సైతం నాశనం చేస్తూ కూకటి వేళ్ళతో సహ కూల్చి వేస్తుందనడంలో భారత సైన్యం పై నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ, మంథని, రామగిరి మండల అద్యక్షులు సబ్బని సంతోష్, విరబోయిన రాజేందర్, కొండ్రు లక్ష్మణ్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్య ప్రకాష్ , జిల్లా అధికార ప్రతినిది పోతవేన క్రాంతి కుమార్, కో కన్వీనర్ నాంపల్లి రమేష్ ,కమాన్పూర్ మండల ఇంచార్జీ చిలువేరి సతీష్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ తొట్ల రాజు ,సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, బోయిని నారాయణ, నారామల్లా కృష్ణ, గుమ్మడి శ్రీనివాస్, ఆర్ల ఓదెలు మండల ఉపాధ్యక్షుడు రేపాక శంకర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి లు సమాల అశోక్ ,ఎడ్లా సాగర్,పట్టణ ఉపాధ్యక్షుడు అరుణ్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బోషెల్లీ మౌనిక,హర్ష వర్దన్ , ఓడ్నాల శ్రీనివాస్ ,వేల్పుల సత్యం, ఈసంపల్లి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.