అనారోగ్య బాధితులకు అండగా మంత్రి శ్రీధర్ బాబు
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంభం రమేష్ రెడ్డికి 2.50 లక్షలు ఎల్ఓసి మంజూరు చేసి ఇప్పించారు. రమేష్ రెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చేరి చికిత్స పొందుతున్నట్లు సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే సీఎం సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం వీరికి 2.50 లక్షలు మంజూరు చేయించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకుడు బుధవారం వారికి ఎల్ఓసి మంజూరు కాపీని హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఎల్ఓసి మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబుకు సదరు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.