అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఎమ్మెల్యేలు

సదాశివపేట డిసెంబర్ 26(జనం సాక్షి)సదాశివపేటలో శుక్రవారం అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సదాశివపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి కుమారుడు కన్నె స్వామి వెంకట్ సాయి రెడ్డి ఆధ్వర్యంలో కేశవ గురుస్వామి, గురు స్వాములు చింతా గోపాల్, గోనే శంకర్, సుధాకర్ గౌడ్, నాయుడు, సోము స్వాముల సమక్షంలో అయ్యప్ప దేవాలయంలో మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతలతో అభిషేకం నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణం శరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామ స్మరణంతో దేవాలయం మారుమోగింది. ఈ మహా పడిపూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలు ఆలపించారు. పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలపై అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఉండాలన్నారు. స్వామివారి చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యేలు కోరారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, శివరాజ్ పాటిల్, చింతా సాయినాథ్, మాజీ ఎంపీటీసీ కొండల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



