ఎమ్మెల్సీ అభ్యర్థులు తగిన అర్హతల్లేవ్ : తమిళి సై
హైదరాబాద్ : నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ తిరస్కరించారు. నామినేటెడ్ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లను ఆమె పరిగణలోకి తీసుకోలేదు. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను మంత్రి మండలి సిఫార్సు చేయగా.. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతల్లేవని గవర్నర్ తెలిపారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తమిళి సై అన్నారు.