గంగాపురిలో కోతుల బీభత్సం

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురిలో కోతులు బీభత్వాన్ని సృష్టించాయి గంగాపురి కి చెందిన ముగ్గురి వ్యక్తులపై కోతులు మూకుమ్మడి దాడి చేశాయి కోతుల దాడిలో గంగాపురి వాసులు తాటి రమేష్ గౌడ్. కోరా కొప్పుల సుధాకర్ గౌడ్ తాటి లక్ష్మణ్ గౌడ్, మంథని మునిసిపాలిటీలోని పద్మశాలి వీధిలో పినగాని సరోజన ల పై కోతులు మూకుమ్మడి దాడి చేశాయి. ఈ కోతుల బెడద రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి ఎన్నిసార్లు ఎన్ని పేపర్లలో వచ్చిన అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరమని గంగాపురి గ్రామ ప్రజలు ఆక్రోసానికి గురవుతున్నారు. గంగాపురి గ్రామ ప్రజలు ఈ కోతులతో జాగ్రత్తగా ఉండాలని గాయపడిన వ్యక్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కోతులను గ్రామాల నుండి అడవిలోకి పంపించాలని మంథని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ కోరుతున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అధికారులను కోరుతున్నారు.



