తక్షణమే ఆపరేషన్ కగార్, ఎన్‌కౌంటర్లను ఆపాలి

 

 

 

 

 

 

భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 21 (జనం సాక్షి): చట్టాలు, కోర్టులు ఉన్నప్పటికీ అరెస్టు చేసిన వ్యక్తులను కోర్టుకు అప్పగించకుండా కాల్చిచంపడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి పగడాల శివ అన్నారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం దంతూరు గ్రామంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బూటకపు ఎన్‌కౌంటర్లను, ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక ఆపరేషన్‌ కగార్, ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని, వాటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలని, మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను తక్షణమే ఆపాలని నినదించారు. ఈ కార్యక్రమంలో పోతగల్ల నర్సింహా, కొత్తబాబు యాదవ్, పాక లింగుస్వామి, పందుల సత్తయ్య, పాక కొండయ్య, పోలాజు సత్యనారాయణ, గంగదారి అంజయ్య, ఉయ్యాల శ్రీను, గంగదారి అశోక్, పోలాజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.