ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

టేకులపల్లి, నవంబర్ 21(జనంసాక్షి):
అఖిలపక్ష పార్టీల డిమాండ్
బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తో కొనసాగిస్తున్న నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.మావోయిస్టు నాయకులను సానుభూతి పరులను, ప్రజలను పెద్ద ఎత్తున బూటకపు ఎకౌంటర్లో హత్య చేస్తున్నారని, ఈ హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్, ఏ ఐ కె యం ఎస్ జిల్లా నాయకులు భూక్యా హర్జా,సి పి ఐ నాయకులు ఐతా శ్రీరాములు,మాస్ లైన్ డివిజన్ నాయకులు జర్పులా సుందర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ మాట్లడుతూ దేశంలో కొనసాగుతున్న ఆకలి చావులను పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా దేశంలో ప్రశ్నించే అవకాశం లేకుండా చేయవచ్చు అని,అలా కాకుండా దేశంలో రోజురోజుకు పెరుగుతున్న అవినీతి, పేదరికం, దారిద్రం, ఆకలి చావులను నివారించకుండా ప్రశ్నించే వారిని ఎదురు కాల్పుల పేరుతో పట్టుకొని కాల్చి చంపుతున్నారని, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని,మావోయిస్టు నాయకుల నిర్మూలన ధ్యేయంగా బిజెపి ప్రభుత్వం పోలీస్ బలగాలను మోహరించి మావోయిస్టులపై యుద్ధం చేస్తూ అంతం చేస్తున్నాయని, లొంగుబాటు కోసం వచ్చిన నాయకులను కూడా పట్టుకొని కాల్చి చంపుతున్నారనే ప్రచారం జరుగుతుందని అన్నారు అదేవిధంగా పోలీసు అదుపులో మావోయిస్టు ముఖ్య నాయకులు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుందని నిజంగా పోలీసుల అదుపులో మావోయిస్టులు ఉంటే �


