ప్రారంభమైన పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు

బోధన్, నవంబర్ 21 ( జనంసాక్షి ) : బోధన్ పట్టణం పోస్ట్ ఆఫీస్ వద్ద గల పెద్ద పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు శుక్రవారం ప్రారంభమైనాయి. ఈ మేరకు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి దంపతులు యజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరనల మధ్య విగ్రహ ప్రతిష్ట వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ శంకర్ ( బుజ్జి ), కోశాధికారి గమరపేట శీను, ఉపాధ్యక్షులు సూర లింగం, ఉద్మీర్ సాయిలు, కార్యదర్శులు ఈరపురం చిన్న పోశెట్టి, దండు సంగ్రామ్ లతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


