జీఏస్టీ ప్రక్షాళనతో ప్రజలకు లబ్ధి
` ఈ మేరకు ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించాం
` వాటి అమలుకు సహకరించండి
– రాష్ట్రాలకు మోదీ విజ్ఞప్తి
న్యూఢల్లీి(జనంసాక్షి):జీఎస్‌టీ తదుపరి తరం సంస్కరణలకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించామని, వాటి అమలుకు సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇందులో మార్పులు పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు వ్యాపారులకూ ఎంతో ప్రయోజకరంగా ఉంటాయని అన్నారు. దిల్లీలో రెండు హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ.. జీఎస్‌టీ చట్టాన్ని సరళతరం చేసి, పన్ను రేట్లను సవరించాలని కేంద్రం భావిస్తోందన్నారు.‘’మా దృష్టిలో సంస్కరణలు అనేవి సుపరిపాలన పురోగతిని సూచిస్తాయి. సమీప భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాలు మరింత తేలికగా, సులభంగా మార్చే ఉద్దేశంతో సంస్కరణలు అమలు చేసేందుకు ‘నెక్ట్స్ జెన్ జీఎస్‌టీ’తో సిద్ధమయ్యాం. వచ్చే దీపావళికి ఈ సంస్కరణలు రెట్టింపు బోనస్‌ను ఇస్తాయి.జీఎస్‌టీ సంస్కరణలకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. వీటికి అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా దీపావళి మరింత అద్భుతంగా మారుతుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సంస్కరణల ప్రతిపాదనలపై చర్చించేందుకు వచ్చే నెలలో జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రతిపాదిత రెండు శ్లాబుల విధానాన్ని జీఎస్‌టీ మండలి ఆమోదిస్తే, ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల్లో 12, 28 శాతం శ్లాబులు తొలగిపోనున్నాయి. 5%, 18% శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఇది ‘గేమ్ ఛేంజర్’ సంస్కరణగా మిగిలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. సుమారు 6 నెలల పాటు సాగిన చర్చలు, డజన్ల సమావేశాల తర్వాత ప్రతిపాదిత జీఎస్‌టీ విధానం తెరమీదకు వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి.
అభివృద్ధి చెందుతోన్న భారత్‌కు దిల్లీ ఓ నమూనా : ప్రధాని మోదీ
అభివృద్ధి చెందుతోన్న భారత్‌కు దిల్లీ ఓ నమూనాగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం గత 11 ఏళ్లుగా తమ ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కృషి చేస్తోందన్నారు.దేశ రాజధానిలో సుమారు రూ.11వేల కోట్లతో నిర్మించిన రెండు ప్రధాన హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన.. వీటితో దిల్లీ, సమీప ప్రాంత ప్రజలకు ఈ రహదారులు ఎంతో సౌలభ్యంగా ఉంటాయన్నారు. ‘’అధునాతన కనెక్టివిటీ పొందిన దిల్లీ ప్రజలకు అభినందనలు. ప్రపంచం భారత్‌పై ఓ అభిప్రాయానికి రావాలనుకున్నప్పుడు తొలుత దాని చూపు రాజధాని వైపు ఉంటుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశానికి దిల్లీని ఓ నమూనాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ప్రభుత్వం అనేక స్థాయిల్లో కృషి చేస్తోంది. గడిచిన 11 ఏళ్లలో దిల్లీ ఎన్‌సీఆర్‌లో ప్రయాణం సులభతరమైంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు సమీప ప్రాంతాలకు ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రెండు కొత్త ప్రాజెక్టులు పూర్తిగా అందుబాటులోకి వస్తే సోనిపత్, రోప్‌ాతక్, బహదుర్‌గఢ్‌తోపాటు గురుగ్రామ్ నుంచి ఐజీఐ ఎయిర్‌పోర్టు వరకు ప్రయాణం సులభమవుతుందన్నారు. అంతకుముందు రోహిణి ప్రాంతంలో మెగా రోడ్ షో నిర్వహించిన మోదీ.. ప్రాజెక్టు పనుల గురించి సమీక్ష జరిపారు.