భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించిన ఫిలిప్పీన్స్

స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్‌పోర్ట్‌తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. ఇందుకు ఎన్నో దరఖాస్తులు, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే, చాలామంది విదేశాలకు వెళ్లాలంటే జంకుతారు. ఆ కోరిక ఉన్నా.. ఈ తతంగాలన్నీ పూర్తి చేయలేక వెనక్కి తగ్గుతుంటారు. అయితే, వీసాతో పని లేకుండా స్వేచ్ఛగా మా దేశానికి రండని కొన్ని దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు వెళ్లేందుకు వీసాతో పని లేదు. భారతీయులకు ప్రత్యేకంగా ఈ దేశాల్లో నిబంధనలేమీ ఉండవు. కొన్ని దేశాలు వీసాకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో తాత్కాలిక వెసులుబాటును కల్పించాయి. మరికొన్ని దేశాలు గడువులు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ పర్యాటకులకు ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్సీన్స్శు భవార్త చెప్పింది. వీసాలేకుండానే తమ దేశంలోకి భారతీయులు ప్రవేశించవచ్చని తెలిపింది. ఇందుకోసం రెండు రకాల స్వల్పకాలిక వీసా రహిత ప్రవేశ సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే, వీటికి వేర్వేరు అర్హతా ప్రమాణాలున్నాయి.

తాజావార్తలు