కుప్రియాల్ వద్ద యాక్సిడెంట్ తక్షణమే స్పందించిన పోలీసు సిబ్బంది

నవంబర్ 18 (జనంసాక్షి)సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ శివారులో మంగళవారం 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నవీన్, కమ్మరి సౌందర్య ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో వారికి గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న వెంటనే సదాశివనగర్ పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, తమ సొంత పెట్రోలింగ్ కారులో ప్రథమ చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి స్థిరంగా ఉంది సదాశివనగర్ ఎస్ఐ పుష్పరాజ్ మరియు సిబ్బంది శీఘ్ర స్పందనతో ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించ కలిగామని వైద్య సిబ్బంది తెలిపారు


