ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత

రామకృష్ణాపూర్, ఆగస్టు 30 (జనంసాక్షి :

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలిమందమర్రి సిఐ శశిధర్ రెడ్డిరామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆర్కేపీ 4 వ ఏరియాలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ, అదేశాల మేరకు,మంచిర్యాల డి.సి.పి భాస్కర్. ఐ.పిఎస్. పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్బంగా మందమర్రి సీఐ. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అన్నారు.కాలనీ లలో ఎవరైనా కొత్త వ్యక్తులు, పాత నేరస్తులు, ఎవరైనా అనుమానస్పదంగా వ్యక్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని పట్టణ ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఏవైనా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు.సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవనీ హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలన్నారు. స్వీయ రక్షణ కొరకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో ఒక సీసీ కెమెర 100 మంది పోలీసులతో సమానం అన్నారు. చోరీలు నేరాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.అనంతరం
పట్టణ యస్.ఐ రాజశేఖర్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మ హత్యలు, లైంగిక వేదింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై వివిధ చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూన్నామన్నారు. షీ టీమ్ , డయల్ 100 పలు అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడo జరిగిందనీ, ఏదైనా సమాచారం అందించిన వారి పేర్లు గొప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 73 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటో లను అదుపులోకి తీసుకోని అందులో సరైన పత్రాలు లేని వాటికీ జరిమానా విధించి, నెంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం లో మందమర్రి యస్.ఐ. రాజశేఖర్, దేవాపూర్ యస్.ఐ. ఆంజనేయులు, కాసిపేట్ యస్.ఐ. ప్రవీణ్ కుమార్ , ఆర్ ఎస్ ఐ వెంకటేష్ , స్పెషల్ అర్ముడ్ సిబ్బంది, నార్కోటిక్ స్పెషల్ టీమ్ వారు తమ జాగిలాలతో పాల్గొన్నారు. మందమర్రి సర్కిల్ పరిధిలో గల పోలీస్ సిబ్బంది 60 మంది , ఆర్కేపీ 4వ ఏరియాలో గల ప్రజలు 100 మంది హాజరయ్యారు.