కమాన్ పూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
మంథని, (జనంసాక్షి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ఆవరణలో గురువారం భారత బావి ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బర్త్ డే కేక్ ను కాంగ్రెస్ నాయకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వైద్యశాలలోని రోగులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగు సత్యనారాయణ గౌడ్, ఎండి.ముస్తాక్, గడప కృష్ణమూర్తి, పిల్లి శేఖర్, దాసరి గట్టయ్య, గుంజపడు రవి, మల్యాల మహేష్ గౌడ్, గెల్లి లింగయ్య, కాల్వ ఓదెలు, బోనాల సత్యం, పిట్టల తిరుపతి, గోడిసెల స్వామి, మల్యాల చిన్న తిరుపతి తదితరులు పాల్గొన్నారు.