రోడ్డు వెడల్పు చేయాలని వినతి
రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక విఠల్ నగర్ నుండి ఓవర్ బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు చేయాలని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుకు స్థానిక బిజెపి నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓవర్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం కానున్న సందర్భంలో ఈ మార్గం గుండా నిత్యం వేలాది మంది ప్రయాణాలు కొనసాగిస్తారని, అలాగే రోడ్డుకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేసి రాత్రిపూట ప్రమాదాలు చోటు చేసుకోకుండా మున్సిపల్ కమిషనర్ చొరవ చూపాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బంగారి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి పురుషోత్తం, నాయకులు దేవరననేని సంజీవరావు, ఎల్లేష్ ఉన్నారు.