పేద ప్రజలకు సేవ చేయడమే మహాభాగ్యం
– లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి
మంథని, (జనంసాక్షి) : పేద ప్రజలకు సేవ చేయడమే మహాభాగ్యం అని కమాన్ పూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర శిబిరాన్ని ఎస్సై కొట్టే ప్రసాద్, ఎంపీడీవో లలిత శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో వైద్య శిబిరంలో కంటి పరీక్ష చేయించుకున్న వారికి భోజనాలను ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీపీ కోలేటి మారుతి 45 మందికి మెడికల్ టెస్టులకు గాను రూ. 10,000, ప్రముఖ వైద్యులు డాక్టర్ పి.విజయకుమార్ తరపున ఆమె సతీమణి విజయలక్ష్మి 30 మందికి మెడికల్ టెస్టులకు గాను 6,600 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇందులో 120 మందికి పరీక్షలు నిర్వహించగా కంటి చికిత్స అవసరమైన వారిని రేకుర్తి కంటి ఆస్పత్రికి బస్సు ద్వారా తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కమాన్ పూర్ మండల ప్రజలకు సేవ చేయడం నా భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. కమాన్ పూర్ మండల వాసులకు మరిన్ని సేవలు చేస్తానని అన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి సహాయ సహకారాలు అందించిన కోలేటి మారుతి, మచ్చగిరి రాము, డాక్టర్ విజయకుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు ఇనగంటి భాస్కరరావు, లయన్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, నూక రమేష్ , పి. విజయ, గుమ్మడి అంజయ్య పటేల్, చెప్పాల సమ్మయ్య, అనవేన లక్ష్మీ రాజం, బొజ్జ సాగర్, నారగోని సతీష్ గౌడ్, జంగేపల్లి సతీష్, రెబల్ రాజ్ కుమార్, చొప్పరి సంతోష్, కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.