రోడ్డును ఆక్రమించి దుకాణాలు

 

 

 

 

 

 

 

 

జహీరాబాద్ టౌన్, నవంబర్ 19( జనం సాక్షి)

మున్సిపల్ అధికారుల చేతివాటం

వివక్ష చూపుతున్న పోలీస్ అధికారులు

జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహం ముందు రహదారిపై పలుదుకాణాలు చాలా సంవత్సరాల నుండి వున్నాయి.గతంలో అనేక పర్యాయాలు అధికారులు తీయించడానికి ప్రయత్నించారు కానీ కొంతమంది అధికారులకు మరియు కొంతమంది దళారులకు ఇష్టంలేక చూసి చూడనట్టుగా వ్యవహారించారు.రహదారిపై వున్న ఈ దుకాణాలకు డిమాండ్ ఎక్కువ కావడంవల్ల మున్సిపల్ అధికారులు,ఇతర అధికారులు లక్షల రూపాయలు దండుకోవడం వల్ల వీటి జోలికి వెళ్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రతి రోజు లక్షల మంది పాదచారులు,వాహన దారులు ఈ రహదారి వెంట తిరుగుతుంటారు,వీరు ఈ రోడ్డు ప్రక్కన వున్న దుకాణాల వల్ల ట్రాఫిక్ అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు.కానీ వీటి గురించి ఏ అధికారి పట్టించుకోవడం లేదని ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.గతంలో పోలీస్ శాఖవారు శ్రీనివాస్ థియేటర్ నుండి రహదారికి ఇరుపక్కలా దుకాణా దారులు దుకాణాల ముందు మెట్లు కానీ,రేకుషెడ్డులు వేసిఅక్రమించిన వాటిని బుల్డోజర్లతో తొలగించారు.బుల్డోజర్లను చూసి కొందరు పట్టణ ప్రజలు సంబర పడ్డారు.దీనిని కొందరు దుకాణదారులు వ్యతిరికించగా రహదారిపై ట్రాఫిక్ ఇబ్బదులు ఎక్కువ కావడంవల్ల రహదారిపై వున్న అన్ని అక్రమ నిర్మాణాలను తొగిస్తున్నామని నచ్చజెప్పడంతో,మన జహీరాబాద్ లో టాఫిక్ సమస్య తొలిగిపోతుందని సంబరపడ్డారు దుకాణదారులు,ప్రజలు.మొదటి రెండు రోజులు బ్లాక్ రోడ్ వరకు అతిక్రమణలను తొలగించారు.మూడవరోజు బుల్డోజర్ కనపడక పోవడం,ప్రభుత్వ వసతి గృహం ముందు రోడ్డుకు ఇరుప్రక్కల అతిక్రమణలు అలాగేవుండటంతో ప్రజలు అవాక్కయ్యారు.అధికారులకు లక్షల రూపాయలు అందడంవల్ల వీటిని తొలగించడంలేదని వాపోయారు.మరికొందరు వివక్ష చూపుతున్నారని,మరికొందరు వారివెనుక పెద్ద పెద్ద నాయకులు వున్నారని,మరికొందరు వారంటే భయం అని గుసగుసలాడుతున్నారు.పది రోజులక్రితం ఆదర్శనగర్ వెళ్లే దారికి ఇరుపక్కలా వున్న వాటిని పోలీసువారు బుల్డోజర్లతో తొలగించారు.తమ ఇంటిముందు సొంతడబ్బుతో మెట్లు,సీసీ రోడ్డు ను తమ గల్లీలో నిర్మించుకుంటే బుల్డోజర్లతో తవ్వేశారని,మరి రోడ్డుపై రోడ్డును ఆక్రమించుకొని దుకాణాలు నిర్మించుకున్నా వాటిని ఎందుకు తొలగించడంలేదని ప్రశ్నించారు.అధికారులు అమాయకులపైనే ప్రతాపం చూపుతారని వాపోయారు.ఇప్పటికైనా అధికారులు తేరుకొని ప్రధాన రహదారి పైన,లతీఫ్ రోడ్,బ్లాక్ రోడ్,తహసీల్దార్ రోడ్ ఇతర జనం రద్దీగా వున్న దారులలో అక్రమంగా నిర్మించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.