సోషల్ మీడియాను బాధ్యతగా వాడాలి : మంథని ఎస్ఐ రమేష్
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధి మంథని పట్టణ ప్రజలు యువత సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహిత ప్రవర్తనపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం అని మంథని ఎస్ ఐ రమేష్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఇరువర్గాలను రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా పోస్టులు, కామెంట్లు పెడుతున్నట్లు పోలీసులు దృష్టికి రావడం జరిగిందని, ఇటువంటి చర్యలు ప్రజల ప్రశాంత జీవనానికి, శాంతి, భద్రతలకు ప్రమాదకరమని శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం కలదు అని ఎస్ఐ తెలిపారు. ఇరువర్గాలను రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా లేదా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా లేదా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసే సమాచారం నిజమా కాదా అని ధృవీకరించకుండా పంచుకోవడం, ఇతరులను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం, ఘర్షణలకు కారణమయ్యే వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. అందరూ సోషల్ మీడియాను బాధ్యతగా ఉపయోగించాలని, ఏవైనా ప్రేరేపించే పోస్టులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాజంలో శాంతి, సహనం పాటిస్తూ ఒకరికొకరు గౌరవ విస్తూ ప్రవర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్ ఐ రమేష్ స్పష్టం చేశారు.



