బాధిత కుటుంబాలను పరామర్శించిన శ్రీను బాబు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ అత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబు గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే మంథని పట్టణంలో బేజ్జల హరికిరణ్ అమ్మ సావిత్రి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను, తోట పుల్లమ్మ ఇటీవల ఆనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను, శ్రీపాద కాలనీలో పింగిలి మోహన్ రెడ్డి, ఆయిలి లింగయ్య, యేలకోరు సురేందర్ రెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను శ్రీను బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తాజావార్తలు