
వికారాబాద్ జిల్లా బ్యూరో ఫిబ్రవరి13 (జనం సాక్షి) : హాస్టల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం గొప్పలు చెప్పుకుంటున్న హాస్టల్లో తరచు సంఘటనలు జరుగుతున్నాయి. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు కొందరు విద్యార్థులు అనారోగ్యానికి గురై చావు నుంచి బయటపడితే మరికొందరు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకు ఉదాహరణగా వికారాబాద్ జిల్లా గిరిజన హాస్టల్లో 10వ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుల్కచర్ల గిరిజన హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న దేవేందర్ అనే విద్యార్థి తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి ఉదయం లేవకపోవడంతో గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి తెలియజేయడంతో విద్యార్థిని పరిగె ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ధృవీకరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరికి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కొడుకు మృతి చెందినట్లు వారు ఆందోళన చేస్తున్నారు. వీరికి తోడు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు తోడు కావడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రి వద్ద భారీగా మోహరించారు. ఇంక సమగ్ర సమాచారం అందవలసి ఉంది.