ఖమ్మం జిల్లాలో విజయవంతమైన భారత్ బంద్
ఆగస్టు 21 ( జనం సాక్షి) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాలు మొత్తం సుప్రీంకోర్టు తీర్పును పునర్ పరిశీలించాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమాన్ని అంబేద్కర్,పాత బస్టాండ్ సెంటర్ బస్సు డిపో జిల్లా కోర్ట్ సెంటర్లలో రహదారులు ద్రిగ్భంధం చేస్తూ బందు నిర్వహించడం జరిగింది. అనేక విద్యాసంస్థలకు పోయి మేనేజ్మెంట్ వారితో మాట్లాడి బందు పాటించమని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ భారత్ బంద్ కు సపోర్ట్ చేస్తూ జిల్లాలో ఉండబడినటువంటి ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలు మరియు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బందును పాటించినారు అలాగనే జిల్లాలో ఉండబడినటువంటి శాంతిభద్రతలను నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఉద్యమకారులకు సపోర్ట్ చేస్తూ సహకరించినారు ఉద్యమకారులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా బంధు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గుంతెటి వీరభద్రయ్య లింగాల రవికుమార్ గులగట్టు ఎల్లయ్య దామల్ల సత్యం బీఎస్పీ నాయకులు చెరుకుపల్లి నాగేశ్వరరావు కొరివి దయానంద్ కొట్టే సుధాకర్ గుమ్మడి కనకరాజు సురక నాగేశ్వరరావు దాసరి శ్రీనివాస్ కామా ప్రభాకర్ జమ్మి వీరబాబు ఎర్ర గంగాధర్ పేరం మల్లయ్య తలారి రాధాకృష్ణ కరాటే వేణు చిరంజీవి ప్రభాకర్ బుర్ర ఉపేంద్ర మిరియాల నాగరాజు గాదరి బాబు చింతల రవి తప్పెట్ల భాస్కర్ చింతపల్లి వెంకటేశ్వర్లు జక్కం స్వాతి బండ్ల జ్యోతి రాయల శ్రీను కొట్టే నాగేందర్ పప్పుల వేణు సిహెచ్ గురుమూర్తి యోనా గుర్రం మనోజ్ నీరుడు రాంబాబు ఉన్నోజు ఉదయ్ గురువులు సాలే నితీష్ ఇంకా అనేకమంది నాయకులు కార్యకర్తలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు