సుజాత కుటుంబానికి  భరోసా,లక్ష ఆర్థికసాయం:మంత్రి పొంగులేటి

 

 

 భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ

ఖమ్మం, (జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీని… తనను నమ్ముకుని రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన కార్యకర్త చింతల సుజాత కుటుంబానికి మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. రూ. లక్షను ఆర్థికసాయంగా అందించారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సుజాత కుటుంబాన్ని ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం పరామర్శించారు. ఆమె పిల్లల భవిష్యత్తు తాము చూసుకుంటామని వారిరువురు హామీ ఇచ్చారు. అనంతరం కార్పొరేటర్ జగన్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.