గీత కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

మంగపేట నవంబర్ 18 (జనంసాక్షి)
ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి…
సమస్యలపై పరిష్కారం చూపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం….
ప్రాంతాల్లో గీత వృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న గీత కార్మికులను ప్రభుత్వం విస్మరించడం సరైన పద్ధతి కాదని కల్లుగీత కార్మికుల సంఘం జిల్లా నాయకులు గాజుల ఈశ్వర్ గౌడ్, లోడే శ్రీనివాస్ గౌడ్,రావుల శ్రీనివాస్ గౌడ్, నక్క యాకయ్య గౌడ్ లు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గతంలో సొసైటీలో ఉన్నాయని వాటిని గత ప్రభుత్వాల హాయంలోనే రద్దు చేయడం జరిగిందని వారు తెలిపారు. కానీ నాటి నుండి నేటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేయబడిన గీత సొసైటీలను పునరుద్ధరించాలి అని నాయకులకు తెలిపిన కనీసం పట్టించుకున్న పాపానపోలేదని వారు వాపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏజెన్సీ ప్రాంతాల్లో రద్దు చేయబడిన గీత సొసైటీలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం పరిమితి దాటిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రకటించకపోవడం అన్యాయమని తెలిపారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గీత కార్మికులకు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అనే తరతమ్యం లేకుండా ప్రభుత్వం గీత కార్మికులకు ఇస్తున్న అన్ని రకాల సంక్షేమ ఫలాలను అందించాలని లేనిపక్షంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో గీత కార్మికులు అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు.



