2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు ఇవే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సినిమాలకు అవార్డులు అందించలేదని మురళీమోహన్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉత్తమ సినిమాలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించి, గద్దర్ పేరుతో అవార్డులు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మురళీమోహన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి చైర్మన్ గా 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేశామని జ్యూరీ సభ్యులు తెలిపారు. ఇందులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ఈ కమిటీ గురువారమే ప్రకటించగా.. మిగతా పదేళ్లకు సంబంధించిన అవార్డులను శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది.