వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
రఘునాథ పాలెం సెప్టెంబర్ 20.(జనం సాక్షి)
ఖమ్మం నయాబజార్ కాలేజీలో తుమ్మల యుగంధర్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వరద బాధిత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ మరియు వరదల కారణంగా కాలేజీలో పాడైపొయిన కంప్యూటర్లను అందించే కార్యక్రమంలో పాల్గొన్నా డాక్టర్ తుమ్మల యుగంధర్ వరద బాధితులను కలిసి వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు వారి అండగా ఉంటానని హామి ఇచ్చారు
ఈ కార్య్రమంలో కార్పొరేటర్ వహీదా బేగం, నాళం సతీష్,తమ్మిషెట్టి పరుశురాం,అల్లె సాయి కిరణ్,యాలనాటి కోటేశ్వరరావు,బెల్లంకొండ వాసు,పాలకుర్తి నాగేశ్వరరావు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.