కాటమయ్య రక్షా కవచ్ కిట్ పై శిక్షణ

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ మంథని ఆధ్వర్యంలో కమాన్ పూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గౌడ వృత్తి దారులకు కాటమయ్య రక్షా కవచ్ కిట్ గురించి శిక్షణ అందజేశారు. ఈ ట్రైనింగ్ లో తాటి చెట్టు పైనుండి ప్రమాదవశాత్తు జారి క్రిందపడి మరణించకుండా శాశ్వత అంగవైకల్యం మొదలగు ప్రమాదాలు జరగకుండా ట్రైనింగ్ ఇచ్చి వారికి కాటమయ్య రక్షణ కావచ్ లను అందజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఎస్సై సాయికుమార్, సిబ్బంది మహేందర్ శ్యామ్ నిరంజన్ శ్రీను రవి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెహమాన్, గౌడ కుల సంఘాల నాయకులు మల్యాల రామచంద్రం గౌడ్, రంగు సత్యనారాయణ గౌడ్, నవునూరి నరసయ్య గౌడ్, గౌడ కుల పెద్దలు, గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు