యాసంగి పంటలపై శిక్షణా కార్యక్రమం

భువనగిరి రూరల్ సెప్టెంబర్ 28, జనం సాక్షి :ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నాగిరెడ్డి పల్లి గ్రామంలో “యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు” అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం లో భాగంగా కార్యక్రమాన్ని గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలో గల వనరులను వివరిస్తూ, అధిక దిగుబడికి పాటించవలసిన మెళకువలను రైతులకు మరియు గ్రామస్థులకు వివరించారు. ఏరువాక శాస్త్రవేత్త (సేద్య విభాగం) కే.మమత మాట్లాడుతూ యాసంగి లో వేసుకోదగ్గ పంటలు వాటి వివరాలను రైతులకు తెలియజేసారు. సహాయ వ్యవసాయ సంచాలకులు, వేంకటేశ్వర రావు వ్యవసాయ శాఖ సేవాలను సద్వినియోగం చేసుకోవాలని, పచ్చి రొట్ట పంటలను, భాస్వరాన్ని కరిగించే ఎరువులను వాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మారెడ్డి, సేంద్రియ ఎరువులతో పంటలు వేస్తున్న రైతు గంగారం స్వామి, కాసాని వెంకటేష్, గాదె శేఖర్, రెడ్డి మల్లారెడ్డి,రాళ్లబండి వెంకటేష్,నాగిరెడ్డిపల్లి గ్రామ రావేప్ విద్యార్థినిలు, గ్రామ సిబ్బంది,గ్రామ అభ్యుదయ రైతులు, మహిళలు పాల్గొన్నారు.