TSPSC నిర్వహించిన అన్ని పరీక్షలను మరియు కమీషన్ ను రద్దు చేయాలి


ఇల్లేందుల రాజు. మెటుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
మెటుపల్లి, టౌన్, మార్చి 16,జనంసాక్షి:మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో నిర్వహించిన పత్రికా సమావేశంలో మెటుపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇల్లేందుల రాజు మాట్లాడుతూ… TSPSC కమిషన్ TRS ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై నిరుద్యోగులు, ఉద్యోగార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, పేపర్ లీకేజీ వ్యవహారం లో కూడా అధికార పార్టీ పెద్దల హస్తం ఉండే అవకాశం మెండుగా ఉందని, ఈ వ్యవహారం కేవలం ప్రవీణ్ తో జరిగింది కాదని అతనికి ప్రభుత్వ మరియు కమిషన్ పెద్దల మద్దతు ఉందని అన్నారు. ఇట్టి లీకేజీ వ్యవహారం వల్ల గ్రూప్1 అభ్యర్థులు కూడా అయోమయంలో పడ్డారని అనేక మంది అభ్యర్థులు గ్రూప్1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానం వ్యక్తం చేయడంతో గ్రూప్1 పరిక్షను కూడా రద్దు చేయాలని మరియు ప్రస్తుత TSPSC కమిషన్ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం లో 2 లక్షల ఉద్యోగాలు పూర్తి పారదర్శకంగా ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఇట్టి విషయాన్ని గమనించి పార్టీకి మద్దతుగా ఉండాలని నిరుద్యోగులను, విద్యార్థులను, ఉద్యోగార్థులను కోరారు.