TSPSC వెబ్‌సైట్‌లో.. TGT హాల్‌టికెట్లు

తెలంగాణ గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు TSPSC తెలిపింది. ఈ నెల 29న ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్, 30న సైన్స్ పరీక్ష జరుగనున్నది. హాల్‌టికెట్‌లోని మార్గదర్శకాలను అనుసరించి అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలని TSPSC సూచించింది.

సోమవారం (ఆగస్టు 28) జరుగనున్న గురుకులాల్లోని PGT ఇంగ్లిష్ పరీక్షకు అన్ని ఏర్పాట్లుచేసినట్లు TSPSC కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు.

ఆదివారం (ఆగస్టు27)న PGT భాషా పండిట్‌తోపాటు మరో మూడు మూడు క్యాటగిరీలకు సంబంధించి నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది.