కార్యాలయంలో సినారె చిత్రపటం ప్రత్యక్షంజిల్లా రచయితల హర్షం
“జనంసాక్షి” కథనానికి స్పందన.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 29. (జనంసాక్షి). జిల్లా గ్రంధాలయ సంస్థ భవనానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన చిత్రపటం స్టోర్ రూమ్ కు చేరడంపై ఇటీవల “జనంసాక్షి’ ప్రత్యేక కథనాన్ని అందించిన విషయం తెలిసిందే. సినారె చిత్రపటాన్ని తిరిగి గ్రంథాలయ సంస్థ లో ఏర్పాటు చేయడంపై జిల్లా రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినారె జయంతి సందర్భంగా సినారె చిత్రపటానికి అర్పించడం సంతోషంగా ఉందని పలువురు రచయితలు తెలిపారు. స్పందించేలా కథనాన్ని అందించిన “జనంసాక్షి”కి జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఏలగొండ రవి, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి అడేపు లక్ష్మణ్, వెంగాల లక్ష్మణ్, జనపాల శంకరయ్య, వాసరవేణి పరుశరాములు, వెంగల లక్ష్మణ్, చిటికెన కిరణ్, బూర దేవానందం, గుండెల్లి వంశి, దూడం గణేష్, అంకారపు రవి, కామారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.