యువత ప్రజాసేవలో ముందుండాలి : ఎస్సై కొట్టె ప్రసాద్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబెల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో.. కమాన్‌పూర్ మండలానికి చెందిన నూతన యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుల బృందం మండల ఎస్సై కొట్టే ప్రసాద్ ని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా, ఎస్సై కి శాలువా కప్పి సన్మానించారు. గ్రామ స్థాయిలో యూత్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, యువత సమస్యలు, ప్రజా భద్రత అంశాలు, భవిష్యత్తులో మండలంలో అమలు చేయనున్న కార్యక్రమాలను వివరించారు. నూతన గ్రామ శాఖ అధ్యక్షులు ప్రజలకు సేవ చేయుటలో పోలీసు శాఖతో సమన్వయం కొనసాగిస్తూ, గ్రామాల్లో శాంతి–భద్రతలను కాపాడటానికి తాము సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కమాన్ పూర్ చిగురు రవీందర్, జూలపల్లి గడ్డం రాజమహేందర్, పెంచికల్ పేట లింగాల రాజేందర్, రొంపికుంట గుమ్మడి రాజ్ కుమార్, సిద్దిపల్లి బంగారి మహేష్, పేరేపల్లి కలవేన రమేష్, గొల్లపల్లి నాగపురి అజయ్, నాగారం బూస నరేష్,
గుండారం, వడ్లకొండ అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.