అమరావతిని మార్చొద్దు

share on facebook

– రైతుల ఆందోళన ఉధృతం, ఉధ్రిక్తత
– రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన రైతులు, మహిళలు
– యూనివర్శిటీ బస్సు అద్దాలు పగలగొట్టిన ఆందోళనకారులు
– విూడియా ప్రతినిధులపైనా దాడి
– ఎర్రపాలెంలో టైర్లుకాల్చి రైతుల నిరసన
– రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– ఆందోళనకు మద్దతు తెలిపిన టీడీపీ నేతలు.. అరెస్టు చేసిన పోలీసులు
అమరావతి, డిసెంబర్‌27(జ‌నంసాక్షి) : మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి ప్రాంతం శుక్రవారం అట్టుడికింది. నిరసనలు ¬రెత్తాయి. మందడం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 144 సెక్షన్‌ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో… తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆక్రోశానికి లోనైన మహిళలు… పోలీసులపై విరుచుకుపడ్డారు. మా భూములు తీసుకుని మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ… ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రశాంతంగా ఆందోళనలు చేసుకోనివ్వారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. రాజధానిపై ఏపీ కేబినెట్‌ ఏ నిర్ణయంపై  తీసుకుంటోందనన్న ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుంటే.. మరోవైపు రాజధాని గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరులోను రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కేబినెట్‌లో తమకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని నినాదాలు చేశారు. శుక్రవారం ఉదయం ఓ యూనివర్సిటీ బస్సులు అద్దాలు పగలగొట్టిన ఆందోళనకారులు… ఉద్దండరాయునిపాలెంలో మరింత రెచ్చిపోయారు. విూడియా ప్రతినిధులపై దాడికి దిగారు. తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ విూడియా ప్రతినిధులపై దాడిచేశారు ఆందోళనకారులు. విూడియా సిబ్బంది ప్రయాణిస్తున్న కారుపైనా అటాక్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. అయితే.. ఆందోళనకారులు దాడిచేస్తున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. వారు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో ఆందోళనలు కొనసాగాయి. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. అమరావతి పరిధిలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ఆంధ్ర రాష్టాన్రికి రాజధాని కావాలంటే తమ భూములు ఇచ్చామనీ ఇప్పుడు ప్రభుత్వం మారినట్లుగా రాజధానిని కూడా మారుస్తామంటే ఊరుకునేది లేదని ఆందోళన చేస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలంతంగా వ్యానుల్లోకి ఎక్కించటంతో ఆవేదన చెందిన రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి సీఎం అయి ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్‌ చేసి జైల్లో పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతుల్ని బాధ పెట్టిన ఏ ప్రభుత్వం నిలవలేదనీ ఇప్పుడు మా భూములు తీసుకుని మమ్మల్ని అన్యాయంచేస్తూ రాజధానికి తరలిస్తున్నారనీ మాకు న్యాయం చేయమని అడిగితే అరెస్టులు చేస్తారా మమ్మల్ని దొంగల్లా చూస్తారా ఇటువంటి ప్రభుత్వం ఎంతో కాలం ఉండని రైతులు శపిస్తున్నారు. మా ఇంట్లో ఆడవాళ్లు కూడా నడిరోడ్డువిూదికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం పడిపోతుందని రైతుల్ని, మహిళల్ని వేదనకు గురిచేసే ప్రభుత్వాలు నిలవని అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని రైతులు ఆవేదనతో హెచ్చరరించారు. మాకు
జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? విూరు మమ్మల్ని జైల్లో వేసిన మా ఆందోళన మానేది లేదని మందడంలోని రైతులు స్పష్టంచేశారు. మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని..అమరావతినే రాజధాని అని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
పెదకాకాని వద్ద తెదేపా నేతల అరెస్టు..
మూడు రాజధానుల ప్రతిపాదనలపై నిరసనలు కొనసాగాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన పార్టీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేసి పెదకాకాని స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమండ్‌ చేస్తూ గొల్లపూడిలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని దాన్ని ఇప్పుడు సీఎం జగన్‌ తన స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానులని ప్రకటించి విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానికిగా ప్రకటించారని ఇదంతా కుట్ర..రైతుల్ని అన్యాయంచేస్తున్నారంటూ సీఎం జగన్‌ ప్రభుత్వంపై దేవినేని మండిపడ్డారు.
విశాఖలోని భూముల్ని స్వాహా చేయటానికి జగన్‌ విశాఖను రాజధానిగా ప్రకటించారని ఆరోపించారు. వైసీపీ నేతలంతా ఇప్పటికే విశాఖలో భూములు కొన్నారనీ అందుకే విశాఖను రాజధానిగా చేయటానికి ఉత్తరాంధ్రను దోచుకోవాటానికే ఈ పన్నాగాలని ఆరోపించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు నిరసనగా మందడంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు కొనసాగాయి. గ్రామంలో 144 సెక్షన్‌ విధించినప్పటికీ.. రైతులు, మహిళలు పెద్దఎత్తున బయటకొచ్చి ఆందోళన చేసేందుకు యత్నించారు. సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత కూడా నిరసనలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మహిళలంతా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఎర్రబాలెంలోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోడ్డుపై టైర్లు కాల్చి రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని అంశంపై తీరు మార్చుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Other News

Comments are closed.