అమిత్‌షా బెదిరింపులకు భయపడం

share on facebook

– మండిపడ్డ ఎంపి ఓవైసీ

న్యూఢిల్లీ,జులై 15(జనంసాక్షి):జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లుపై లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా కేంద్ర ¬ం మంత్రి అమిత్‌షా తన పట్ల వ్యవహరించిన తీరుపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిప్డడారు. సభలో అమిత్‌షా తనను వేలెత్తి చూపడంపై పార్లమెంటు వెలుపల విూడియాతో ఆయన మాట్లాడుతూ, వారికి (బీజేపీ) మద్దతివ్వని వ్యక్తులు ఎవరైనా సరే వారిని జాతి వ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తుంటారని అన్నారు. వాళ్లేమైనా పలానా వాళ్లు జాతీయవాదులు, పలానా వాళ్లు జాతి వ్యతిరేకవాదులనే దుకాణం తెరిచారా? అని ప్రశ్నించారు. అమిత్‌షా వేలెత్తి చూపుతూ తమను బెదరించారని, అయితే ఆయన కేవలం ¬ం మంత్రే కానీ దేవుడు కాదని అన్నారు. నిబంధనల గురించి ఇతరులకు చెప్పే ముందు ఆయన చదవి తెలుసుకుంటే బాగుంటుందని ఒవైసీ సూచించారు.అంతకుముందు, ఎన్‌ఐఏ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్‌షా, ఒవైసీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో ఓ కేసు విషయంలో అప్పటి పోలీసు కమిషనర్‌ను ఓ నాయకుడు బెదరించాడంటూ బీజేపీ సభ్యుడు సత్యపాల్‌ సింగ్‌ సభలో చెప్పడంతో ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు విూ వద్ద ఉంటే సభ ముందుంచాలని ఒవైసీ డిమాండ్‌ చేశారు. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకుంటూ, అధికార సభ్యులు మాట్లాడుతుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డుతగలరాదని, ఓపిగ్గా ఉండాలని సూచించారు. దీనిపై ఒవైసీ ఆందోళన వ్యక్తం చేస్తూ, తన వైపు అమిత్‌షా వేలెత్తి చూపడం ఏమిటని అన్నారు. తననెవరూ భయపెట్టలేరని తెగేసి చెప్పారు. ఇందుకు అమిత్‌షా బదులిస్తూ, తామెవరినీ భయపట్టలేదని, కేవలం సభ్యులు మాట్లాడేది వినాలని మాత్రమే అన్నానని చెప్పారు. ‘విూ మనసులో భయం ఉంటే నేనేమి చేయగలను?’ అంటూ అమిత్‌షా కౌంటర్‌ ఇచ్చారు.

Other News

Comments are closed.