ఉన్నావో ఘటనపై దద్దరిల్లిన లోక్‌సభ 

share on facebook

– అమిత్‌షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షాల డిమాండ్‌
– కేసుకు రాజకీయ రంగు పులమడం సరికాదు
– సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది
– పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్ర¬్లద జోషి
న్యూఢిల్లీ, జులై30 (జనం సాక్షి) : గత ఆదివారం ఉన్నావో రేప్‌ కేసు బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం విధితమే. కాగా రాయబరేలీ జైళ్లో ఉన్న తన అంకుల్‌ మహేష్‌ సింగ్‌ ను కలిసేందుకు లాయర్‌ మహేంద్ర సింగ్‌,తన ఇద్దరు మహిళ బంధువులతో కలిసి యువతి కారులో వెళ్తున్న సమయంలోవెనుక నుంచి వచ్చిన నంబర్‌ ప్లేట్‌ కి నలుపురంగు వేసి ఉన్న ఓ ట్రక్కు కారుని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి ఆంటీలిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన లాయర్‌, యువతిని లక్నోలోని హాస్పిటల్‌ కు తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే వీరిపై హత్యాయత్నం జరిగిందని, ప్రభుత్వం ప్రటిష్ఠ భద్రత కల్పించక పోవటం వల్లే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ విషయమై మంగళవారం లోక్‌ సభ
కూడా దద్దరిల్లింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులమరాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్ర¬్లద్‌ జోషి తెలిపారు. సీబీఐ ఎంక్వైరీ జరుగుతందన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు తెలిపారు. పక్షపాతం లేకుండా ప్రభుత్వం ఈ కేసుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ ను యూపీలోని జైళ్లో కాకుండా వేరే జైలుకి తరలించాలని రాజ్యసభలో ఎస్పీ ఎంపీ రామ్‌ గోపాల్‌ యాదవ్‌ అన్నారు. యాక్సిడెంట్‌ లో మరణించిన కుటుంబాలకు 50లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లోక్‌ సభలో అమిత్‌ షా ఈ యాక్సిడెంట్‌ పై సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ లీడర్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. ఉన్నావో ఘటన చూసి దేశ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. మరోవైపు ఉన్నావో రేపు బాధితురాలి యాక్సిడెంట్‌ ను ఖండిస్తూ తృణముల్‌ కాంగ్రెస్‌,ఎస్పీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఉన్నావో బాధితురాలికి యాక్సిడెంట్‌ దురదృష్టకరమని, ఖండించదగినదని ఎస్పీ చీఫ్‌ అఖిలేఖ్‌ యాదవ్‌ అన్నారు. దేశ మహిళలను ఈ ఘటన షాక్‌ కు గురి చేసిందన్నారు. బీజేపీ నాయకుల ఆదేశాలతోనే బాధితురాలి తండ్రిని లాకప్‌ లో పోలీసులు, ఎమ్మెల్యే కుల్దీప్‌ తమ్ముడు కొట్టి చంపారన్నారు. సీఎం యోగి ఇంటి ముందు బాధిత యువత ఆత్మహత్యకు ప్రయత్నించే వరకు ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేయలేదని,ప్రభుత్వాన్ని,బీజేపీ ఎమ్మెల్యేను ప్రజలు ప్రశ్నించకుండా ఎలా ఉంటార్ననారు.

Other News

Comments are closed.